Jobs In Medical Department: వైద్యరంగంలో ఉద్యోగాలు.. నెలకు లక్షల్లో వేతనం

పార్వతీపురం టౌన్: జపాన్ భాష నేర్చుకుని ఆ దేశ వైద్య రంగంలో ఉద్యోగావకాశాలు పొందవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధికారి యు.సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావీస్ హెచ్‌ఆర్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాషను ఎన్–5, ఎన్–4, ఎన్–3 స్థాయిల్లో నేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Faculty Jobs: జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేశారా?
జపాన్ భాష నేర్చుకున్న వారికి జపాన్‌లోని ఆస్పత్రుల్లో వర్కర్స్ ఇన్, హాస్పిటల్స్, కేర్ హోమ్ ఫెసిలిటీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. జపాన్‌లో పనిచేసేందుకు ఆసక్తి కలిగి, 32 ఏళ్లోపు వయస్సు న్న వారంతా అర్హులేనని, తొలుత జపనీస్ భాషలో రెసిడెన్షియల్ విధానంలో బెంగళూరులోని నివాస్ హెచ్‌ఆర్ సంస్థ కార్యాలయంలో ఆరు నెలల శిక్షణ ఉంటుందన్నారు.
శిక్షణ కాలంలో వసతి, భోజన సౌకర్యాలుంటాయని, ఫీజు మాత్రం రూ. 3.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50 వేలు నైపుణ్యాభివృద్ధి సంస్థ భరిస్తుందని మిగిలిన మొత్తాన్ని అభ్యర్థులే చెల్లించాలని మిగిలిన రూ. 3లక్షల్ని మూడు విడతల్లో చెల్లించే వెసులు బాటు ఉందని తెలిపారు.
శిక్షణ ఫీజు కోసం నావీస్ హెచ్‌ఆర్ సంస్థ రుణ సదుపాయం కల్పిస్తుందని, ఉద్యోగం వచ్చాక మూడు దఫాలుగా తిరిగి చెల్లించవచ్చని స్పష్టం చేశారు. జపాన్‌లో నెలకు జీతం రూ.1.1 లక్షల నుంచి రూ.1.14 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఫోన్ 9676965949 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Tags
- nurse jobs in japan
- Nursing Jobs in Japan
- nurses jobs in Japan
- latest jobs 2024
- Jobs 2024
- Nursing Jobs
- Nursing Jobs Notification
- Nurse jobs
- Staff Nurses Posts
- Japanese language learning
- Job opportunities Japan
- Medical jobs Japan
- U. Saikumar statement
- Japanese courses ANM GNM B.Sc Nursing
- N5 N4 N3 Japanese levels
- Naavis HR training
- Skill development Japan
- Parvathipuram Town
- Japanese language skills
- abroadjobs
- latest jobsin 2024
- sakshieducationlatest jobnotifications