Skip to main content

Mega Job Mela: 20వ తేదీ మెగా జాబ్ మేళా.. అర్హులు వీరే

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు సెప్టెంబ‌ర్ 20వ తేదీ నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
District Skill Development Officer C. Vijayavinil Kumar announcing job fair details  Job Mela at 20th September in Nellore District   job fair organized by AP Skill Development Corporation Mega Job Mela in Nellore district, September 20 District Skill Development Officer C. Vijayavinil Kumar announcing the job fair AP Skill Development Corporation

దీనికి సంబంధించిన వివ‌రాల‌ను జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి.విజయవినీల్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించ‌నున్న‌ట్లు ఆమె అన్నారు. 

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా జరుగుతుందన్నారు. 

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్‌, ఐటీఐ, డిప్ల‌మో, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యుర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవ‌చ్చ‌న్నారు. అర్హ‌త‌లు ఉన్న వారు సెప్టెంబ‌ర్ 20వ తేదీ జ‌రిగే జాబ్‌మేళాకు హాజరు కావాల‌ని చెప్పారు. 

Job Mela: సెప్టెంబర్ 20వ తేదీ జాబ్‌మేళా.. సద్వినియోగం చేసుకోండి

Published date : 16 Sep 2024 10:22AM

Photo Stories