Skip to main content

Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

Job Mela JobOpportunities

పెందుర్తి: నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని స్కిల్‌ హబ్‌లో గురువారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సాయికృష్ణ, జిల్లా ఉపాధి కల్పనాధికారి సుబ్బిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Spot Admissions: రేపు గురుకుల పాఠశాలల్లో స్పాట్‌ అడ్మీషన్స్‌

ఫైజర్‌, హెటెరో ల్యాబ్‌, కేఎల్‌ గ్రూప్‌ తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ, ఐటీఐ ఫిట్టర్‌, డిప్లమా ఇన్‌ ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99487 68778 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Published date : 11 Sep 2024 05:24PM

Photo Stories