Driving Posts Offer: తిరుపతిలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు

సాక్షి ఎడ్యుకేషన్: తిరుపతి జిల్లాలో 104, 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో డ్రైవర్ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్లు ఎస్వీ.శేషసాయన్నరెడ్డి, వీ.సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, మూడేళ్లు అనుభం ఉండాలని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తులను అందించాలని పేర్కొన్నారు.
Job Courses: వృత్తి సంబంధిత కోర్సులు
104 సర్వీసులో తిరుపతిలో ఒక పోస్టు, పాపనాయుడుపేటలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లో తిరుపతిలో 7, పుత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, కోట మండలాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తులను తిరుపతి మున్సిపల్ పార్క్ సౌత్ స్ట్రీట్‌లోని 104, 108 కార్యాలయంలో అందజేయాలని కోరారు.