జీతాలు, రిటైర్మెంట్ వయసుపైసవరణలు: ఉద్యోగులకు ఓకే.. టీచర్లకు నాట్ ఓకే ?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వేతనాలు ఎంత పెంచాలనే విషయంలో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసులు అందజేసింది.
దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి చర్చలు జరుపుతోంది. అయితే వేతనాల పెంపు ప్రభుత్వ ఉద్యోగులకే వర్తింపజేయాలా? ఉపాధ్యాయులకూ వర్తింపజేయాలా? అనే దానిపై ప్రభుత్వానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి’ అని ఉన్నత స్థాయి అధికారవర్గాలు వెల్లడించాయి. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఒకే గాటన కట్టొద్దనే సూచనలు అందుతున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై అన్ని వర్గాల్లో సానుకూలత ఉంది. కానీ ఉపాధ్యాయుల విరమణ వయసు పెంపు విషయంలో అలాంటి ఏకాభిప్రాయం రావట్లేదు. ఉపాధ్యాయులు ఏడాదికి 200 నుంచి 210 రోజులకు మించి పని చేయరు. రోజు వారీ పనిలోనూ ఒత్తిడి తక్కువ. కాబట్టి టీచర్లకు జీతాలు పెంచడం, విరమణ వయసు పెంపు అవసరం లేదన్న అభిప్రాయాలు ప్రభుత్వానికి వస్తున్నాయి’అని పేర్కొంటున్నాయి.
ఉపాధ్యాయులు ప్రభుత్వ పరిధిలో లేరు..
‘నిజానికి ఉపాధ్యాయులు మొదటి నుంచి ప్రభుత్వ పరిధిలో లేరు. మొదటి నుంచి స్థానిక సంస్థల పరిధిలోనే ఉన్నారు. 73వ రాజ్యాంగ సవరణ కూడా విద్యా సంస్థలు, ఉపాధ్యాయుల వ్యవహారాలను స్థానిక సంస్థలకే అప్పగించాలని పేర్కొంది. కాబట్టి ఉపాధ్యాయులను గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల పరిధిలోకి తేవాలనే డిమాండ్ వస్తోంది. ఈ అభిప్రాయాలను, డిమాండ్లను ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఇటీవల త్రిసభ్య కమిటీ ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అనుచితంగా వ్యవహరించడం ప్రభుత్వానికి చిరాకు తెప్పించినట్లు సమాచారం. ముఖ్యంగా యూటీఎఫ్ నాయకుడు చావరవి.. త్రిసభ్య కమిటీ ముందు అహంభావపూరితంగా ప్రవర్తించడం, ప్రభుత్వంపై నిందలు వేసినట్లు సమాచారం. పత్రికా ప్రకటనలు కూడా అసంబద్ధంగా చేయడం పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉంది’అని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేర్వేరు..
‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేర్వేరు కేటగిరీలకు చెందిన వారు. కాబట్టి ప్రభుత్వం ఈ రెండు వర్గాల విషయంలో వేర్వేరుగానే నిర్ణయాలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులను స్థానిక సంస్థల పరిధిలోకి తేవడం వల్ల పర్యవేక్షణ సమర్థంగా జరిగి విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తోంది’అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో అడ్డంకులు తొలగిపోనున్నాయి..
‘ఉద్యోగుల నియామకం, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ప్రధాన అవరోధంగా ఉన్న కోర్టు కేసు త్వరలోనే తొలగిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కొత్త జోనల్ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. అయితే దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొన్ని యూనియన్లు హైకోర్టుకు వెళ్లాయి. దీనిపై కోర్టుకు ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇచ్చింది. ఫలితంగా కోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి’అని ఉన్నతాధికారులు తెలిపారు.

Published date : 10 Feb 2021 02:51PM