ఈ ఏడాది పండుగ సీజన్‌లో మూడు లక్షల పైగా ఉద్యోగాలు
Sakshi Education
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేస్తోంది.
వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్‌సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Published date : 01 Oct 2020 03:46PM