గుడ్‌న్యూస్: తెలంగాణలో త్వరలోనే 20వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ
Sakshi Education
హైదరాబాద్: త్వరలోనే భారీగా 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.
తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 1162 ఎస్సైలలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు.
భారీగా నియామకాలు..: డీజీపీ మహేందర్‌రెడ్డి
తెలంగాణ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఉందని.. అందుకే పోలీస్ శాఖకు పెద్ద ఎత్తున నియామకాలు,నిధులు జరిగాయని డీజీపీ అన్నారు. అలాగే సాంకేతికతను బాగా ఉపయోగించాలని..నిజాయితీ,నిబద్ధతతో పని చేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు.
తెలంగాణ ఎస్సై , కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన బిట్‌బ్యాంక్, స్టడీ మెటీరియల్, సిలబస్, ఆన్‌లైన్ టెస్టులు, కరెంట్ అఫైర్స్, మోడల్ పేపర్స్, జీకే, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 23 Oct 2020 04:11PM