Skip to main content

గుడ్‌న్యూస్‌: ఈ పండుగ సీజ‌న్‌కు అమెజాన్‌లో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ–కామర్స్‌ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి.
ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్‌ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్‌ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్‌ ఫ్లెక్స్‌ పార్ట్‌నర్స్, హౌస్‌కీపింగ్‌ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్‌లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్‌ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్‌లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు.
Published date : 01 Oct 2020 03:14PM

Photo Stories