Skip to main content

ఎయిడెడ్‌ స్కూళ్లలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎయిడెడ్‌ స్కూళ్లలో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
న్యాయస్థానం సూచనలను అనుసరించి ఈ పోస్టుల భర్తీ జరగనుంది. న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేసిన ఎయిడెడ్‌ స్కూళ్లలో మాత్రమే కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎయిడెడ్‌ స్కూళ్లలో రేషనలైజేషన్‌ తదితర ప్రక్రియలు చేపడతారు. అనంతరం టీచర్, విద్యార్థుల నిష్పత్తి (1:40) నిబంధనలు పాటిస్తూ అవసరమైన మేర పోస్టులు భర్తీచేస్తారు. ముందుగా ఈ కసరత్తు పూర్తిచేసి ఏ పాఠశాలలో ఎందరు ఉపాధ్యాయుల అవసరం ఉందో గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. అనంతరం ప్రభుత్వ అనుమతితో పోస్టులు భర్తీచేస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
Published date : 15 Jun 2021 02:31PM

Photo Stories