Google Employees Layoffs : గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. మరోసారి లేఆఫ్‌లు.. సర్దుబాటులో భాగమే..

సాక్షి ఎడ్యుకేషన్: రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ పై దృష్టి సారించిన దిగ్గజ కంపెనీ గూగుల్. మరోసారి తమ కంపెనీలో పునవ్యవస్థీకరణ చర్యలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అక్కడి ఉద్యోగులకు భారీ షాక్ తగలనుంది. అదే మరో లేఆఫ్‌ల ప్రారంభం.. ఇటీవల అక్కడి ఉద్యోగులకు లేఆఫ్‌లు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
రెండోసారి..
ఇప్పటికే, సేల్స్, పార్ట్‌నర్‌షిప్ విభాగాలను పర్యవేక్షించే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్‌లో 200 మంది ఉద్యోగులను తొలగించారని సమాచారం. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ‘ది ఇన్ఫర్మేషన్’ అనే మీడియా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. కస్టమర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ చిన్న చిన్న సర్దుబాట్లు తప్పడం లేదని లేఆఫ్‌ల గురించి గూగుల్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
Rohit Sharma announces retirement: టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై
నెల రోజుల వ్యవధిలో ఈ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. గత నెల.. ఏప్రిల్‌లోనే తమ ప్లాట్‌ఫామ్, డివైజ్ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై ఈ వేటు పడింది.
ఖర్చు తగ్గింపులో భాగం..
ఈ ప్రక్రియలో భాగంగా గత రెండేళ్లలో గూగుల్ చాలామంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే అయితే, గతేడాది డిసెంబరులో మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందికి లేఆఫ్‌లు కూడా ప్రకటించింది. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఆర్ విభాగం, క్లౌడ్ ఆర్గనైజేషన్‌లో కొంతమందిని తొలగించింది. ఇక, ఈ నిర్ణయాలన్ని ఖర్చు తగ్గింపులో భాగంగా తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
TG Inter Exam Fees: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు!
12 వేలమంది తొలగింపు..
గూగుల్‌లో ఉద్యోగులకు సీఈఓ సుందర్ పిచ్చాయి.. మరింత సమర్థవంతంగా పని చేయాలని వెల్లడించారు. 20 శాతం మందికి ఈ విషయాన్ని 2022లో వెల్లడించారు. ఆ మరుసటి ఏడాదే 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది గూగుల్. ఇక, అమెరికాలో విదేశీ నిపుణులపై ట్రంప్ కఠిన నిబంధనలు అమలుచేస్తున్న సమయంలో ఈ లేఆఫ్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు సెర్చింజిన్‌ను తీసుకొస్తుండడంతో గూగుల్‌కు గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్న వేళ ఈ తొలగింపులు చేపట్టడం గమనార్హం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- google layoffs
- second time
- google employees
- 200 plus employees to quit
- artificial intelligence
- Technical development
- Google CEO Sundar Pichai
- lack of employment in google
- 12 thousand layoffs in google
- layoffs in google
- latest news on google layoffs
- Education News
- Sakshi Education News
- CorporateLayoffs