Skip to main content

SSC CGL Notification for Group B and C Posts : గ్రూప్ ‘B’ & గ్రూప్ ‘C’ పోస్టుల‌కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌తేదీలు, వివ‌రాలు ఇవే..

ఎస్ఎస్‌సీ.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 9వ తేదీన సీజీఎల్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
SSC Combined Graduate Level 2025 exam notice  Group b and c posts in ssc cgl official notification released  SSC CGL online application process SSC CGL 2025 notification released

సాక్షి ఎడ్యుకేష‌న్‌: సీజీఎల్‌.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఎగ్జామినేష‌న్ కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టించారు. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలు అండ్ వివిధ రాజ్యాంగ సంస్థలు/చట్టబద్ధమైన సంస్థలు/ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో వివిధ గ్రూప్ ‘B’ & గ్రూప్ ‘C’ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష, 2025ను నిర్వహిస్తుంది.

ఇక‌, ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అధికారులు. 2025కి సంబంధించిన ఎస్ఎస్సీ సీజీఎల్ ప‌రీక్షకు దరఖాస్తుల ప్ర‌క్రియ‌ను ఇప్ప‌టి నుంచే ప్రారంభించాల‌ని, అధికారిక వెబ్‌సైట్‌లో సంద‌ర్శించి వివ‌రాల‌న్నింటి ప‌రిశీలించుకుని ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

బ్రేకింగ్ న్యూస్‌:నేడే AP EdCET 2025 ప్రాథమిక కీ విడుదల ... ఫలితాలు ఎప్పుడంటే

దరఖాస్తుల విధానం:

1. అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. ssc.gov.in
2. లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, లాగిన్ అవ్వండి.
3. దరఖాస్తు ఫార్మ్‌ను పూరించి, రుసుము కూడా చెల్లించండి.
4. పూర్తిగా ప‌రిశీంచిన తరువాత‌, సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి, నిర్ధార‌ణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
5. ఈ కాపీని ప్రింట్ తీసి పెట్టుకోండి. భ‌విష్య‌త్తులో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తులు.. రుసుమును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. 

అయితే, ₹100/-. BHIM UPI, నెట్ బ్యాంకింగ్‌తో లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రుపే డెబిట్ కార్డులను ఉపయోగించి చెల్లించాలి. 

ICC Hall of Fame: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‎లో చోటు దక్కించుకున్న క్రికెటర్లు వీరే!

మహిళా అభ్యర్థులు &షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) అండ్ రిజర్వేషన్లకు అర్హులైన ఎక్స్ సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ముఖ్య‌తేదీలు:

ఈ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ జూన్ 9వ తేదీన అంటే, నిన్న‌టి నుంచి ప్రారంభం కాగా, వ‌చ్చేనెల జులై 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. అప్లై చేసుకున్న అభ్య‌ర్థులకు ఆగ‌స్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు రాత పరీక్షలు నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష విధానం:

ద‌ర‌ఖాస్తులు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు, ప్ర‌క‌టించిన తేదీల్లో నిర్వ‌హించే ప‌రీక్ష‌కు.. 

టైర్-Iలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మినహా ప్రశ్నలు ఇంగ్లీష్ & హిందీ రెండింటిలోనూ సెట్ చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్ I పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి & గరిష్ట మార్కులు 200. 

బ్రేకింగ్ న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2025‑26 అకడమిక్ క్యాలెండర్‌ విడుదల

పరీక్ష వ్యవధి 1 గంట స‌మ‌యం ఉంటుంది.

మ‌రిన్ని వివ‌రాలు లేదా ఎదైనా సందేహాలు ఉంటే, అభ్య‌ర్థులు ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 10 Jun 2025 01:01PM

Photo Stories