Cognizant Hiring 20,000 Freshers : కాగ్నిజెంట్‌లో మరో 20,000 ఫ్రెషర్లు.. సీఈఓ తాజా ప్రకటన..

సాక్షి ఎడ్యుకేషన్: ఫ్రెషర్ల నియామకంపై అమెరికాలోని ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఈ సంవత్సరంలో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థకు భారత్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నార్న విషయం తెలిసిందే. గతంలో.. అక్టోబరు- డిసెంబరు 2024తో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి-మార్చి 2025లో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య పెద్దగా మార్పు లేకుండా 3,36,300గా ఉందని తాజాగా వెల్లడించారు.
మాజీ ఉద్యోగులు కూడా..
‘వృద్ధి, ఆవిష్కరణల ప్రణాళికను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నైపుణ్యాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగానే మొత్తం 20,000 మంది ఫ్రెషర్లను కాగ్నిజెంట్ సంస్థ నియమించుకోనున్నారని, ఇక, మాజీ ఉద్యోగుల్లో 14,000 మంది తిరిగి కంపెనీలో చేరారని, 10 వేల మంది చేరనున్నారని సీఈఓ రవి కుమార్ ప్రకటనలో తెలిపారు.
TG Inter Admissions in Model Schools : ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు.. ఈనెల 5 నుంచి ప్రారంభం..
ఆదాయ వృద్ధి..
జనవరి- మార్చి 2025.. త్రైమాసికానికి కాగ్నిజెంట్ 5.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ప్రకటించింది. 2024లో ఇదే సమయంలోని 4.7 బి. డాలర్లతో పోలిస్తే ఆదాయం 7.45 శాతం పెరిగింది. కాగ్నిజెంట్ జనవరి- డిసెంబరు ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తుంది. అయితే 2025 సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను 3.9- 6.4 శాతానికి కంపెనీ పెంచింది. ఇంతకుముందు 2.6- 5.1 శాతం వృద్ధిని అంచనా వేసింది. 2025 మొత్తం మీద 20.5- 21 బి. డాలర్ల ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని కాగ్నిజెంట్ సంస్థ ఇటీవల ప్రకటించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Cognizant
- freshers
- new financial year
- freshers recruitments
- Cognizant CEO Ravi Kumar
- Cognizant Updates latest
- january to march 2025
- 5.1 billion Revenue for Cognizant
- ex employees
- 10 to 14 thousand ex employees for cognizant
- American IT Company
- Education News
- Sakshi Education News
- JobNotification
- TechJobs2025
- CognizantCareers
- ITJobsIndia
- CognizantRecruitment2025