Skip to main content

241 Vacancies at Supreme Court : 35,400 జీతంతో సుప్రీం కోర్టులో ఉద్యోగం.. ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఇవే..

సుప్రీం కోర్టులో 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న‌వారు కింది వివ‌రాల‌ను ప‌రిశీలించి, ప్ర‌క‌టించిన విధానంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు.
241 posts at supreme court of india with 35400 salary

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు సుప్రీం కోర్టు ఉద్యోగ వార్త వినిపించింది. న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. ఇందులో ప్ర‌స్తుతం, డిగ్రీ అర్హ‌త ఉన్న‌వారు ఈ ఉద్యోగావ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు ప్ర‌క‌టించారు. సుప్రీం కోర్టులో 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న‌వారు కింది వివ‌రాల‌ను ప‌రిశీలించి, ప్ర‌క‌టించిన విధానంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు.

పోస్టు వివ‌రాలు: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు.. (241 పోస్టులు).

అర్హ‌త‌లు: ఏదైనా గుర్తింపు పొందిన‌ యూనివ‌ర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుండాలి. అభ్య‌ర్థి, కంప్యూట‌ర్‌లో నిమిషానికి 35 ప‌దాల‌ను టైప్ చేయ‌గ‌లిగేంత స్పీడ్ ఉండాలి. కంప్యూట‌ర్ ఆప‌రేటింగ్‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి.

Apprenticeship Mela: ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్‌ మేళా

వ‌యోప‌రిమితి: 18 నుంచి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో ఉండాలి.

ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల తేదీ: ఫిబ్ర‌వ‌రి 5 నుంచి మార్చి 8, 2025 వ‌ర‌కు

ద‌ర‌ఖాస్తుల రుసుము: జ‌న‌ర‌ల్ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ. 1000, ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

Free Coaching: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్‌.. లాస్ట్‌డేట్‌ ఎప్పుడంటే

ఎంపిక విధానం: రాత, టైపింగ్, ప‌రీక్ష‌తోపాటు ఇంట‌ర్వ్యూ కూడా నిర్వ‌హిస్తారు.

వేత‌నం: రూ. 35,400 వరకు ఉంటుంది. ప‌నితీరు, స‌మ‌యం బ‌ట్టి పెంచుతారు.

ప‌రీక్ష విధానం: ప‌రీక్ష‌లో మొత్తంగా 100 ఆబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలు ఉంటాయి. దీనికి 2 గంటల సమయం ఉంటుంది.

- జనరల్ ఇంగ్లిష్‌ నుంచి 50 ప్రశ్నలు
- జనరల్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు
- జనరల్ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 

Infosys Layoffs: ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చిన ఇన్ఫోసిస్..700 మందిని తొలగింపు

దీనితోపాటు టైపింగ్ ప‌రీక్ష కూడా ఉంటుంది. దీనికి, 10 నిమిషాలు స‌మ‌యం ఉంటుంది. ఇందులో, 3 శాతం తప్పులకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంగ్లిష్ భాషలో 2 గంటలపాటు డిస్క్రిప్టివ్‌ టైప్‌లో ఎస్సై రాత పరీక్ష ఉంటుంది. వీట‌న్నింటిలో నెగ్గితే, ఉద్యోగం ద‌క్కుతుంది. అభ్య‌ర్థులు వారి ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచి ఉద్యోగం సాధించాల‌ని ఆశిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 05:03PM
PDF

Photo Stories