Skip to main content

డెల్హివెరీ కంపెనీలో 15000 ఉద్యోగాలు

న్యూఢిల్లీ: సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్‌ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది.
రాబోయే పండుగ సీజన్‌లో దాదాపు 6.5–7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్‌పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్‌ టెర్మినల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18–24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్‌ చేయబోతున్నాం అని డెల్హివెరీ ఎండీ సందీప్‌ బరాసియా వెల్లడించారు.
Published date : 01 Oct 2020 03:45PM

Photo Stories