బీఎస్సీ (బోటనీ) విద్యార్హతతోకాంట్రాక్ట్ ఎంపీఈవోలు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు: ఏపీ వ్యవసాయ శాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: వ్యవసాయ శాఖలో ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిన ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారికి బీఎస్సీ (బోటనీ) విద్యార్హతతో గ్రేడ్-2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 536 పోస్టుల భర్తీకి ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం బీఎస్సీ (బోటనీ) విద్యార్హత కలిగిన వారు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు కాగా, శాఖలో కాంట్రాక్టు ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారికి ఆ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఎంపీఈవోలు 30, 31వ తేదీల్లో నిర్దేశించిన పరీక్షా రుసుము అన్‌లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
Published date : 30 Jan 2020 04:57PM