Skip to main content

Another cut in Amazon.. this time another 20 thousand people: అమెజాన్‌లో మళ్లీ కోత.. ఈ సారి మరో 20 వేల మంది

ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి భారీగా ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇప్పటికే 10వేలకు పైగా సిబ్బందిని తొలగించినట్లు ప్రకటించిన అమెజాన్‌ తాజాగా టాప్‌ మేనేజర్లు సహా 20 వేల మందికి ఉద్వాసన పలికేందుకు రెడీ అవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

దీంతో  ఎవరి జాబ్‌కు ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియక ఉద్యోగులు  వణికిపోతున్నారు. తాజా నివేదికల ప్రకారం రిటైల్,  క్లౌడ్‌ కంప్యూటింగ్‌ బిజినెస్‌ దెబ్బ కారణంగా రానున్న నెలల్లో అమెజాన్‌  ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. 

ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలోనే...
డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వర్కర్లు, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లతో సహా రాబోయే నెలల్లో కంపెనీ అంతటా 20 వేల మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్‌ యోచిస్తోంది.  ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగించే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు జారీచేసి, పరిహార ప్యాకేజ్‌ను సెటిల్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కంపెనీ మేనేజర్లు, ఉద్యోగులలో పని పనితీరు సమస్యలను గుర్తించడానికి ప్రయత్నించాలని చెప్పిందట. ఇరవై వేల మంది ఉద్యోగులు దాదాపు 6 శాతం కార్పొరేట్‌ సిబ్బందికి సమానం. కాగా పలు విభాగాల్లో ఉద్యోగుల లేఆఫ్స్‌పై అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ ఇటీవల సంకేతాలు  అందించిన సంగతి తెలిసిందే.

Published date : 06 Dec 2022 04:52PM

Photo Stories