Skip to main content

అక్టోబర్‌లో 11.55 లక్షల కొత్త ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ నెలలో 11.55 లక్షల మంది కొత్తగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్)లో సభ్యులుగా నమోదయ్యారు.
గతేడాది అక్టోబర్‌లో 7.39 లక్షల మంది నూతన చేరికతో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదైంది. వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాల తీరును ఈపీఎఫ్‌వో గణాంకాల రూపంలో కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈపీఎఫ్‌వోలో 14.19 లక్షల మంది చేరికతో పోలిస్తే అక్టోబర్‌లో తగ్గినట్టు తెలుస్తోంది. కరోనా తర్వాత దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,79,685 మంది సభ్యులు ఈపీఎఫ్‌వో నుంచి తగ్గిపోయినట్టు గతంలో ప్రకటించిన గణాంకాలను.. తాజాగా 1,49,248గా సవరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వోలో 39.33 లక్షల మంది కొత్త సభ్యులుగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హరియాణాలో ఎక్కువ వృద్ధి కనిపించింది.
Published date : 21 Dec 2020 03:56PM

Photo Stories