250 మందిని ఇంజనీర్లను నియమించుకోనున్న ఉబెర్
Sakshi Education
న్యూఢిల్లీ: రైడ్ హెయిలింగ్, ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న ఉబెర్ కొత్తగా 250 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది.
ఇంజనీరింగ్, ప్రొడక్ట్ వర్క్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు టెక్నాలజీ సెంటర్ల కోసం వీరిని రిక్రూట్ చేయనుంది. 2021 చివరినాటికి ఈ రెండు కేంద్రాల్లో సిబ్బంది సంఖ్య 1,000కి చేరే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. మొబిలిటీ, డెలివరీ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రపంచవ్యాప్తంగా 10,000 నగరాల్లో రవాణాకు వెన్నెముకగా నిలవడానికి విస్తరణ ప్రణాళికలు సంస్థ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని ఉబెర్ తెలిపింది.
Published date : 10 Jun 2021 05:35PM