1,12,843 మంది ప్రైవేట్ టీచర్లకు నగదు బదిలీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,12,843 మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి మంగళవారం రాత్రి వరకు రూ.2 వేల చొప్పున నగదును వారి అకౌంట్లకు బదిలీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బోధన, బోధనేతర సిబ్బంది ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం, 25 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2.06 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 1.24 లక్షల మంది లబి్ధదారులను విద్యాశాఖ ఎంపిక చేసింది. మిగతా వారికి ఈనెల 24లోగా ఆర్థిక సహాయం అందజేయనుంది. కాగా, బుధవారం నుంచి బియ్యాన్ని కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీ కోసం రూ. 15.15 కోట్లు విడుదల చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Published date : 21 Apr 2021 07:34PM