JEE Main 2022: జేఈఈ టాపర్లలో తెలుగు తేజాలు
సెషన్–1, సెషన్–2 పేరిట రెండు విడతల్లో నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తంమీద 24 మంది నూటికి నూరు పర్సంటైల్‌తో టాపర్లుగా నిలవగా వారిలో ఏకంగా 10 మంది తెలుగు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. తెలంగాణకు చెందిన రూపేష్ బియానీ, ధీరజ్ కురుకుండ, జాస్తి యశ్వంత్ వీవీఎస్, బూస శివనాగ వెంకట ఆదిత్య, అనిఖేత్ చటోపాధ్యాయతోపాటు ఏపీకి చెందిన మెండా హిమవంశీ, కొయ్యన సుహాస్, పల్లి జలజాక్షి, పెనికలపాటి రవికిశోర్, పొలిశెట్టి కార్తికేయ 100 శాతం ఎన్‌టీఏ స్కోర్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో తెలంగాణకు చెందిన గైకోటి విఘ్నేశ్ 99.87 పర్సంటైల్‌తో టాపర్‌గా నిలవగా, పీడబ్ల్యూడీ విభాగంలో మాదాల రాహుల్ 99.79 పర్సంటైల్‌తో టాప్ ఐదో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ National Testing Agency (NTA) ఆగస్టు 8న JEE Main (సెషన్–2) ఫలితాలతోపాటు రెండు విడతల్లో కలిపి టాపర్ల జాబితాను ప్రకటించింది. అమ్మాయిల విభాగంలో 38 మందిని ఎన్‌టీఏ టాపర్లుగా ప్రకటిస్తే వారిలో తెలంగాణకు చెందిన చంద్ర మౌమిత (99.98 పర్సంటైల్) చోటు సంపాదించింది. రెండు విడతల ఈ పరీక్షకు మొత్తం 10,26,799 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 9,05,590 మంది పరీక్ష రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.
చదవండి: జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ విధివిధానాలు...
కేటగిరీలవారీగా ఇదీ కటాఫ్....
దేశవ్యాప్తంగా దాదాపు 9.05 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాస్తే వారిలో టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ కేటగిరీలవారీ కటాఫ్ మార్కులను ఎన్‌టీఏ ప్రకటించింది. దీని ఆధారంగా కనీస, గరిష్ట పర్సంటైల్ ఈ విధంగా ఉంది.
చదవండి: JEE Main 2020 Paper I Question Paper (2nd Sep 2020 Shift 2)with key
కేటగిరీ |
కనీసం |
గరిష్టం |
జనరల్ |
88.4121383 |
100 |
జనరల్ (పీడబ్ల్యూడీ) |
0.0031029 |
88.3784882 |
ఈడబ్ల్యూఎస్ |
63.1114141 |
88.4081747 |
ఓబీసీ–ఎన్‌సీఎల్ |
67.0090297 |
88.4081747 |
ఎస్సీ |
43.0820954 |
88.4037478 |
ఎస్టీ |
26.7771328 |
88.4072779 |
చదవండి: JEE Main 2020 Paper I Question Paper (2nd Sep 2020 Shift 1)with key
సమానమైన స్కోర్‌కు టై బ్రేకర్‌తో పరిష్కారం
జేఈఈ మెయిన్ ఫలితాల్లో సాధారణంగా ఒక క్లిష్టమైన సమస్య ఎదురవుతూ ఉంటుంది. అందరికీ ఒకే మార్కులు వచ్చినప్పుడు మొదలెవరు? చివర ఎవరు? అనే విషయం ఉత్పన్నమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) టై బ్రేకర్ విధానాన్ని అనుసరిస్తుంది. అందరికీ సమానమైన మార్కులు వచ్చినప్పుడు ముందుగా మేథ్స్‌లో ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు? ఎన్ని మైనస్ మార్కులు వచ్చాయి? వాటి నిష్పత్తి ఎంత? అనేది పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్పులను చూస్తుంది. ఇవన్నీ పూర్తయ్యాక కూడా సమానమైన ర్యాంకులో ఉంటే అప్పుడు వయసును ప్రామాణికంగా తీసుకుంటుంది. ఎవరు ఎక్కువ వయసు ఉంటే వారిని ముందు ర్యాంకర్‌గా ప్రకటిస్తుంది.
చదవండి: JEE Main Previous Papers
ఐఏఎస్ అవుతా...
ప్రణాళిక ప్రకారం చదవడంతోనే ఈడబ్ల్యూఎస్ కోటాలో అత్యుత్తమ ర్యాంకు సాధించా. ఐఏఎస్ అయి పేద ప్రజలకు సేవ చేయాలనేది నా లక్ష్యం.
– గైకోటి విఘ్నేశ్, హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామం
నాకు అన్యాయం జరిగింది..
జేఈఈ మెయిన్ ఫలితాల్లో నాకు అన్యాయం జరిగింది. ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ ప్రకారం నాకు 184 స్కోర్ రావాల్సి ఉండగా ఫలితాల్లో 49 స్కోర్ మాత్రమే వచ్చింది. దీనిపై ఎన్టీఏకు ఫిర్యాదు చేశా. ఎన్టీఏ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నా.
కదిరి భువనేశ్వరి, హైదరాబాద్