Skip to main content

విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పించండి: సబితా ఇంద్రారెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థినులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆత్మరక్షణ మెలకువలను నేర్పించేందుకు చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిడిసెంబర్ 2నలేఖ రాశారు.
 విద్యార్థినులపై అఘాయిత్యాలు, దాడులు జరగకుండా సరైన అవగాహన కల్పించాలని డీజీపీకి సూచించారు. ఈ విషయంలో పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అనే విషయంపై విద్యార్థినులను చైతన్య పరచాలని అన్నారు. షీ-టీమ్స్‌పై అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్‌ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. వేధింపులకు గురవుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. వాట్సాప్, కంట్రోల్ రూమ్, షీ-టీమ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల్లో వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు.
Published date : 03 Dec 2019 02:16PM

Photo Stories