వెబ్‌సైట్లో ఇంటర్ రీ వెరిఫికేషన్ పత్రాల సమాచారం
Sakshi Education
ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి పునఃపరిశీలనకు (రీ వెరిఫికేషన్) వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 10,500 మంది జవాబు పత్రాల పరిశీలన పూర్తయింది.
వీటి పరిశీలనలో వచ్చిన మార్పులు, చేర్పుల సమాచారాన్ని www.bieap.gov.in లో పొందుపరచినట్లు కార్యదర్శి తెలిపారు. వీటిని విద్యార్ధులు సరిచూసుకోవచ్చన్నారు. ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసిన వారి సమాచారం మే 10 నాటికి వెబ్‌సైట్లో పొందుపరుస్తామని చెప్పారు.
Published date : 01 May 2017 02:11PM