వెబ్‌సైట్‌లో ఇంటర్ గుర్తింపు కాలేజీల జాబితా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ద్వారా గుర్తింపు (అఫిలియేషన్) పొందిన జూనియర్ కాలేజీల జాబితాను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ విడుదల చేశారు.
మే 21న ఫస్టియర్ అడ్మిషన్ల ప్రకటన వెలువడిన తర్వాతనే ఆయా కాలేజీల్లో అనుమతి పొందాలని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లేని కాలేజీల్లో చేరి ఇబ్బందులకు గురికాకూడదని సూచించారు. అనుమతి పొందిన కాలేజీల జాబితాను tsbie.cgg.gov.in, acad.tsbie. telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.
Published date : 02 May 2018 02:51PM