వెబ్సైట్లో ఇంటర్ అడ్వాన్స్ డ్ హాల్టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 7 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
ప్రధాన పరీక్షలు జూన్ 12తో ముగుస్తాయన్నారు. బోర్డు కార్యాలయంలో జూన్ 4వ తేదీన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 040-24601010, 040-24732369 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలకు 4,63,236 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అశోక్ తెలిపారు. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు 3,14,773 మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు 1,48,463 మంది ఉన్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ కోసం 857 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
వెబ్సైట్లో హాల్టికెట్లు...
విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లను పంపించామని, అయినా ఇంకా అందకుంటే బోర్డు వెబ్సైట్ bie.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అశోక్ సూచించారు. వాటిపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకాలు లేకపోయినా అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓఎరఆర్ షీట్లలో విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే విద్యార్థులు చూసుకొని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే ఆ తరువాత విద్యార్థులదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.

Published date : 05 Jun 2019 03:53PM