వాట్సాప్‌లో ప్రశ్నపత్రం
Sakshi Education
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్‌లో కెమిస్ట్రీ పేపర్ లీక్ కావడం కలకలం రేపింది.
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు మార్చి 17న నిర్వహించారు. ఉదయం 9.52 గంటలకు ‘ప్రైవేట్ లెక్చరర్స్ ఇన్ వరంగల్’పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో నగరానికి చెందిన ఓ ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు కెమిస్ట్రీ మొదటి సంవత్సరం ప్రశ్నపత్రాన్ని పోస్టు చేశాడు. దీంతో గ్రూపులో ఉన్న మిగతా అధ్యాపకులు కంగుతిన్నారు. ప్రశ్నపత్రం ఎక్కడిది? ఇలా ఎందుకు పోస్టు చేశారనే చర్చ సాగింది. ఆ వెంటనే పలువురు అధ్యాపకులు ఆ గ్రూపు నుంచి లెఫ్ట్ కావడం గమనార్హం. వరంగల్ జిల్లాలోని ఏదో పరీక్ష కేంద్రం నిర్వాహకులతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందంతోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా.. అదే సమయంలో సమాధానాలు కూడా పంపించారా అన్నది తేలాల్సి ఉంది. కాగా, వాట్సాప్‌లో పేపర్ లీక్ అయిన విషయం తన దృష్టికి రాలేదని ఆర్‌జేడీ వెంక్యానాయక్ విలేకరులకు తెలిపారు.
Published date : 18 Mar 2020 05:03PM