Skip to main content

టీఎస్ జూనియర్ ఇంటర్ ఎన్విరాన్మెంటల్ పరీక్షలో గందరగోళం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు జనవరి 30 (గురువారం)ననిర్వహించిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలో గందరగోళం నెలకొంది.
విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నా పత్రంలో 4 ప్రశ్నలను ఎంచుకోవాలని, ప్రతి ప్రశ్నకు 15 మార్కులు ఉంటాయని ఉంది. కానీ ఇంటర్ బోర్డు నుంచి మాత్రం 5 ప్రశ్నలను ఎంచుకోవాలని, ప్రతి ప్రశ్నకు 12 మార్కులు ఉంటాయని బోర్డు అధికారులు మెయిల్ పెట్టారు. ఆ తర్వాత 12 ప్రశ్నలకు జవాబులు రాయాలని, ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున ఉంటాయన్నారు. ఈ విషయాలను లెక్చరర్లు విద్యార్థులకు చెప్పడంతో వారు తీవ్ర గందరగోళంలో పడ్డారు. జవాబుల బుక్‌లెట్‌లో 8 ప్రశ్నలు మాత్రమే ఉండటం గందరగోళానికి కారణమైందని లెక్చరర్లు పేర్కొన్నారు.
Published date : 31 Jan 2020 02:44PM

Photo Stories