టీఎస్ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 15,483 మంది గైర్హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో మొదటి రోజైనమార్చి 5 (గురువారం)నద్వితీయ భాష పేపరు పరీక్షకు 15,483 మంది (3.69 శాతం) గైర్హాజరయ్యారు.
మొత్తంగా పరీక్షలు రాసేందుకు 4,18,944 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,03,459 మంది హాజరయ్యారు. అందులో 22 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడటంతో వారిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేశారు. నిజామాబాద్‌లో ఇద్దరు, యాదాద్రిలో 5 మంది, రంగారెడ్డిలో 12 మంది, మహబూబ్‌నగర్‌లో ఒకరు, మెదక్‌లో ఒకరు, నారాయణ్‌పేట్‌లో ఒకరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు. మహబూబ్‌నగర్‌లో జవాబు పత్రాలను ఎత్తుకెళ్లిన ఒకరిని పట్టుకొని, పోలీసులకు అప్పగించామని, అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.
Published date : 06 Mar 2020 01:50PM