టీఎస్ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కి స్థానచలనం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది.
ఇంటర్ విద్యా కమిషనర్, ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 1998వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సయ్యద్ అహ్మద్ జలీల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ బోర్డు బాధ్యతల నుంచి తప్పించడంతో అశోక్ ఇక మీదట ఆర్జీయూకేటీ వైస్‌చాన్‌సలర్‌గా మాత్రమే కొనసాగనున్నారు.
Published date : 21 Sep 2019 03:00PM