Skip to main content

టీఎస్ ఎంసెట్‌లో ర్యాంకు.. ఇంటర్‌లో ఫెయిల్

సాక్షి, హైదరాబాద్: ఇదో విచిత్ర పరిస్థితి. తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థులు వేలసంఖ్యలో ఉన్నారు. దీంతో వారంతా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మొదటిదశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందలేని పరిస్థితి నెలకొంది.
తెలంగాణ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు మొత్తం 1,31,209 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 1,08,213 మంది అర్హత సాధించారు. కానీ, వీరిలోనూ 91,446 మంది విద్యార్థులకు మాత్రమే ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించింది. మిగతా 13,251 మంది విద్యార్థులు ఇంటర్‌లో ఫెయిలయ్యారు. దీంతో వారికి ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించలేదు. మరో 3,491 మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ మార్కుల వివరాలు లేకపోవడంతో ర్యాంకులను కేటాయించలేదని ఎంసెట్ కమిటీ వెల్లడించింది. అగ్రికల్చర్ విభాగంలో 68,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 63,758 మంది అర్హత సాధించారు. అయితే, అందులో 57,774 మం దికే ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించింది. మిగతా విద్యార్థుల్లో 4,194 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ కావడంతో వారికి ర్యాంకులను కేటాయించలేదు. మరో 1,790 మంది విద్యార్థుల ఇంటర్ మార్కుల వివరాలు లేకపోవడంతో వారికి ర్యాంకులను కేటాయించలేదని ఎంసెట్ కమిటీ వివరించింది. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులంతా అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. వారి లో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం కేటాయించిన ర్యాంకులు ఉండవు. అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా తదుపరి ర్యాంకులను కేటాయించనున్నారు.

ఇంజనీరింగ్ కేటగిరీలో..

హాజరు

అర్హత సాధించినవారు

కేటగిరీ బాలురు బాలికలు మొత్తం బాలురు బాలికలు మొత్తం
బీసీ-ఏ 5,182 3,031 8,213 3,141 1,936 5,077
బీసీ-బీ 15,828 10,546 26,374 10,474 7,512 17,986
బీసీ-సీ 462 285 747 270 185 455
బీసీ-డీ 13,933 8,798 22,731 9,005 6,170 15,175
బీసీ-ఇ 5,627 1,626 7,523 2,748 998 3,746
ఓసీ 28,397 18,421 46,818 19,917 14,231 34,148
ఎస్సీ 7,055 5,058 12,113 5,180 4,037 9,217
ఎస్టీ 4,736 2,224 6,960 3,797 1,845 5,642

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల ఫలితాలు ...

హాజరు

అర్హత సాధించినవారు

కేటగిరీ బాలురు బాలికలు మొత్తం బాలురు బాలికలు మొత్తం
బీసీ-ఏ 1,519 3,286 4,805 1,231 2,695 3,926
బీసీ-బీ 3,569 8,204 11,773 2,883 6,957 9,840
బీసీ-సీ 169 557 726 132 482 614
బీసీ-డీ 3,797 8,036 11,833 2,992 6,717 9,709
బీసీ-ఇ 1,866 4,394 6,260 1,328 3,579 4,907
ఓసీ 3,496 8,923 12,419 2,861 7,723 10,584
ఎస్సీ 4,201 9,669 13,870 3,643 8,509 12,152
ఎస్టీ 2,748 4,116 6,864 2,419 3,620 6,309
Published date : 10 Jun 2019 04:58PM

Photo Stories