తెలంగాణలో ఇంటర్ ఫీజు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరీక్ష ఫీజులు చెల్లించే విద్యార్థులపైనా పడింది. బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయలేక ఇంటర్ విద్యార్థుల్లో చాలామంది ఇంకా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు.
సాధారణ గడువులోగా, అంటే ఈ నెల 4వ తేదీలోగా ఫీజు చెల్లించిన వారికి సమస్య తలెత్తకపోయినా ఆలస్య రుసుముతో చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 14తో ముగిసింది. కానీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల్లో 15 శాతం మంది ఇంకా ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంతో రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపళ్లు ఆలస్య రుసుముతో ఫీజును స్వీకరించాలని, ఆ మొత్తాన్ని 22న మొత్తాన్ని బోర్డుకు పంపాలని సూచించారు.
రూ. 50 ఆలస్య రుసుముతో టెన్త్ ఫీజు చెల్లింపు అవకాశం :
మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఈ నెల 23వ తేదీ వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 1 దాకా, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9 దాకా చెల్లించవచ్చన్నారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు గడువు అక్టోబరు 31తో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నవంబర్ 15 దాకా పొడిగించారు. ఆ గడువూ ముగిసినా మరో 10 శాతం విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది.

Published date : 16 Nov 2016 01:27PM