తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచే..
గందరగోళం, అనుమానాలు వద్దనే...
వాస్తవానికి మార్చి 1 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేలా బోర్డు నవంబర్ 7న టైంటేబుల్‌ను ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పునరాలోచనలో పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్ ఆప్షనల్ సబ్జెక్టుల్లో కామన్ సిలబస్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పరీక్ష జరిగిన మర్నాడే తెలంగాణలో అదే పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరీక్షల ప్రశ్నపత్రాన్ని తెలంగాణలో పేపర్ లీకేజీ పేరిట వదంతులు సృష్టిస్తే తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. పైగా ఆ ప్రశ్నపత్రాలపై అది ఏ రాష్ట్ర బోర్డుకు చెందిందో ఉండదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఎటువంటి గందరగోళం, ఆందోళన తలెత్తకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే తేదీల్లోనే రాష్ట్రంలోనూ వార్షిక పరీక్షలు నిర్వహించేలా తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను సవరించింది.
సవరించిన టైంటేబుల్ ఇదీ...
తేదీ | ఫస్టియర్ (సబ్జెక్టు) | తేదీ | సెకండియర్ (సబ్జెక్టు) |
28-2-2018 | ద్వితీయ భాష పేపర్-1 | 1-3-2018 | ద్వితీయ భాష పేపర్-2 |
3-3-2018 | ఇంగ్లిష్ పేపర్-1 | 5-3-2018 | ఇంగ్లిష్ పేపర్-2 |
6-3-2018 | మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, | 7-3-2018 | మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, |
- | బోటనీ పేపర్-1, | - | బోటనీ పేపర్-2 |
- | సివిక్స్ పేపర్-1, | - | సివిక్స్ పేపర్-2 |
- | సైకాలజీ పేపర్-1 | - | సైకాలజీ పేపర్-2 |
8-3-2018 | మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, | 9-3-2018 | మ్యాథమెటిక్స్ పేపర్-2బీ |
- | జువాలజీ పేపర్-1, | - | జువాలజీ పేపర్-2, |
- | హిస్టరీ పేపర్-1 | - | హిస్టరీ పేపర్-2 |
10-3-2018 | ఫిజిక్స్ పేపర్-1, | 12-3-2018 | ఫిజిక్స్ పేపర్-2, |
- | ఎకనామిక్స్ పేపర్-1 | - | ఎకనామిక్స్ పేపర్-2 |
- | క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్ పేపర్-1 | - | క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2 |
13-3-2018 | కెమిస్ట్రీ పేపర్-1 | 14-3-2018 | కెమిస్ట్రీ పేపర్-2 |
- | కామర్స్ పేపర్-1 | - | కామర్స్ పేపర్-2 |
- | సోషియాలజీ పేపర్-1 | - | సోషియాలజీ పేపర్-2 |
- | ఫైన్ ఆర్‌ట్స, మ్యూజిక్ పేపర్-1 | - | ఫైన్ ఆర్‌ట్స, మ్యూజిక్ పేపర్-2 |
15-3-2018 | జియాలజీ పేపర్-1 | 16-3-2018 | జియాలజీ పేపర్-2 |
- | హోం సెన్సైస్ పేపర్-1 | - | హోం సెన్సైస్ పేపర్-2 |
- | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌న్ పేపర్-1 | - | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌న్ పేపర్-2 |
- | లాజిక్ పేపర్-1 | - | లాజిక్ పేపర్-2 |
- | బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ వారికి) | - | బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ వారికి) |
17-3-2018 | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 | 19-3-2018 | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2 |
- | జియోగ్రఫీ పేపర్-1 | - | జియోగ్రఫీ పేపర్-2 |