తెలంగాణ ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి.
జూన్ 13న సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 24 నుంచి మే 20 వరకు జరిగిన ఈ పరీక్షల్లో ఎస్సెస్సీకి 47,986 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 16,595 మంది (34.58 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 35,462 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 13,755 మంది (38.79 శాతం) ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఫలితాలను వెబ్‌సైట్ (www.telanganaopenschool.org) నుంచి పొందవచ్చు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్, ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ, జాయింట్ డెరైక్టర్ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 14 Jun 2019 04:45PM