తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల సత్తా
Sakshi Education
బ్రహ్మంగారిమఠం(మైదుకూరు)/ముప్పాళ్ళ (సత్తెనపల్లి), హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను ఈనెల 16న హైదరాబాద్‌లో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.
రెండు సంవత్సరాల్లోను బాలికలే ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. ఎంఈసీ గ్రూపులో రాష్ట్రంలో ద్వితీయస్థానం, ఎంపీసీ గ్రూపులో నాలుగో స్థానం సాధించారు. వైఎస్సార్ జిల్లా బి.మఠం మండలం కేశాపురం గ్రామానికి చెందిన శీలం రామగురివిరెడ్డి, పెంచలమ్మ (సర్పంచ్)ల కుమారుడు శీలం గురుమహేశ్వరరెడ్డి ఎంఈసీలో రెండోస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చదువుతున్న అతడు 500 మార్కులకుగాను 492 సాధించాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన కాల్వ నివేదిత ఎంపీసీలో నాలుగో స్థానంలో నిలిచింది. 470 మార్కులకుగాను 464 సాధించిన ఆమె గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో నూరుశాతం మార్కులు వచ్చాయి. ఆమె గతంలో తెలంగాణ పాలిసెట్‌లో 16వ ర్యాంకు సాధించింది.
Published date : 17 Apr 2017 03:02PM