Skip to main content

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.
బాలురకంటే అధిక ఉత్తీర్ణత శాతంతో ముందు స్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలికలు 63.38 శాతం ఉత్తీర్ణత సాధించగా... బాలురు 50.18 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలు 71.63 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 61.02 శాతంతో సరిపెట్టుకున్నారు. సెకండియర్ ఎంపీసీలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండా నిఖిత 993 మార్కులతో ప్రథమ స్థానంలో నిలువగా.. బైపీసీలో 991 మార్కులతో మంచిర్యాల జిల్లాకు చెందిన పిట్టల లక్ష్మి భవాని ప్రథమ స్థానంలో నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా గతనెల 1 నుంచి 14 వరకు నిర్వహించిన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు ఈనెల 16న విడుదల అయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. గతేడాది మాదిరే ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ సంవత్సర (జనరల్, వొకేషనల్) పరీక్షలకు 4,75,874 మంది విద్యార్థులు హాజరు కాగా.. 2,70,738 మంది (56.89 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు (జనరల్, వొకేషనల్) 4,14,213 మంది విద్యార్థులు హాజరు కాగా 2,75,273 మంది (66.45) శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

గతేడాదికంటే పెరిగిన ఉత్తీర్ణత...
గతేడాది కంటే ఈసారి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది జనరల్, వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 62.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఈసారి 66.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో గత ఏడాది (జనరల్, వొకేషనల్) 54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈసారి 56.89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒక్క జనరల్‌లో చూస్తే.. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,36,727 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 2,50,589 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ పరీక్షలకు 39,147 మంది విద్యార్థులు హాజరు కాగా 20,149 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర జనరల్ పరీక్షలకు 3,83,182 మంది హాజరు కాగా 2,55,296 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే వొకేషనల్‌లో 31,031 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 19,977 మంది ఉత్తీర్ణులయ్యారు.

మేడ్చల్ ఫస్ట్.. రంగారెడ్డి సెకండ్...
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వచ్చిన ఫలితాలు కావడంతో జిల్లాల వారీగా ఉత్తీర్ణతపై కాస్త ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రథమ సంవత్సర (జనరల్) ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 75 శాతంతో ప్రథమస్థానంలో ఉండగా, రంగారెడ్డి జిల్లా 69 శాతంతో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక 34 శాతంతో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అయితే వొకేషనల్‌లో 74 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో నిలవగా.. 66 శాతంతో కుమ్రం భీం జిల్లా రెండో స్థానంలో ఉంది. 32 శాతంతో మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. ద్వితీయ సంవత్సరంలోనూ (జనరల్) 82 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ ప్రథమ స్థానంలో నిలువగా.. 78 శాతంతో రంగారెడ్డి ద్వితీయ స్థానంలో ఉంది. 44 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్, మహబూబాబాద్, గద్వాల జిల్లాలు చివరన నిలిచాయి. వొకేషనల్‌లో 82 శాతంతో కుమ్రం భీం జిల్లా ప్రథమస్థానంలో ఉండగా.. 81 శాతంతో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచింది. 37 శాతం ఉత్తీర్ణతతో గద్వాల చివరి స్థానంలో ఉంది.

బాల, బాలికల ఉత్తీర్ణత శాతం ఇలా..
ప్రథమ సంవత్సరంలో...

కేటగిరీ

హాజరు

ఉత్తీర్ణులు

ఉత్తీర్ణ శాతం

బాలికలు

2,39,607

1,51,886

63.38

బాలురు

2,36,807

1,18,852

50.18


ద్వితీయ సంవత్సరంలో...

కేటగిరీ

హాజరు

ఉత్తీర్ణులు

ఉత్తీర్ణ శాతం

బాలికలు

2,12,485

1,52,169

71.63

బాలురు

2,01,728

1,23,104

61.02


ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థుల్లో ఉత్తీర్ణులు గ్రేడ్‌లవారీగా..
‘ఎ’ గ్రేడ్‌లో:
1,26,957 (50.66 శాతం)
‘బి’ గ్రేడ్‌లో: 71,318 (28.46 శాతం)
‘సి’ గ్రేడ్‌లో: 35,820 (14.29 శాతం)
‘డి’ గ్రేడ్‌లో: 16,494 (6.58 శాతం)

ద్వితీయ సంవత్సర జనరల్ విద్యార్థుల్లో ఉత్తీర్ణులు గ్రేడ్‌లవారీగా..
‘ఎ’ గ్రేడ్‌లో:
1,36,549 (53.48 శాతం)
‘బి’ గ్రేడ్‌లో: 75,956 (29.75 శాతం)
‘సి’ గ్రేడ్‌లో: 32,427 (12.7 శాతం)
‘డి’ గ్రేడ్‌లో: 10,364 (4.05 శాతం)

ఇంటర్ టాపర్లు వీరే...
ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) ఫలితాల్లో అత్యధిక మార్కులను (993) ఖమ్మం జిల్లాకు చెందిన కొండా నిఖిత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ నోమన్ రజ్వి సాధించి టాపర్లుగా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన వంగాల సాయిచరణ్ 992 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో మంచిర్యాల జిల్లాకు చెందిన పిట్టల లక్ష్మి భవానీ, రంగా రెడ్డి జిల్లాకు చెందిన పోతరాజు దీపిక, హైదరాబాద్‌కు చెందిన అమ్లినా ప్రియదర్శిని 991 మార్కులతో టాపర్లుగా నిలిచారు. బైపీసీ టాపర్లు ముగ్గురు బాలికలే కావడం విశేషం. 990 మార్కులను మరో ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన పోచంపల్లి దివ్య 986 మార్కులతో టాపర్‌గా నిలవగా.. సీఈసీలో వనపర్తి జిల్లాకు చెందిన జె.సాయిస్వరూప్‌రెడ్డి 976 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. హెచ్‌ఈసీలో 950 మార్కులతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివార్చక మానస టాపర్‌గా నిలిచింది.

ప్రథమ సంవత్సరంలో..
ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 467 టాప్ మార్కులను 12 మంది విద్యార్థులు సాధించారు. బైపీసీలో 436 టాప్ మార్కులను 11 మంది విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో 493 టాప్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సాధించగా, సీఈసీలో 492 టాప్ మార్కులను ఒకే ఒక విద్యార్థి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బి.హర్ష సాధించారు. హెచ్‌ఈసీలో 470 టాప్ మార్కులను హైదరాబాద్‌కు చెందిన లికితారెడ్డి సాధించారు.

ఫస్టియర్ టాపర్లు వీరే...
ఎంపీసీలో...:
12 మంది 467 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వారి వివరాలు కలావేన కార్తీక్ (కరీంనగర్), పింగిలి మనీశ్‌రెడ్డి(కరీంనగర్), ములగాని తనూజ(ఖమ్మం), శ్యామలాంబ పూజిత (భద్రాద్రి), ఎస్.ప్రియాశర్మ(నిజామాబాద్), గత్ప పావణి (మహబూబ్‌నగర్), పుట్ట లావణ్య(మహబూబ్‌నగర్), యానాల నవీన్‌రెడ్డి(రంగారెడ్డి), తూము జోహార్‌రెడ్డి (రంగారెడ్డి), కందిమల్ల ప్రణీత(రంగారెడ్డి), బూర్ల సంధ్య (మేడ్చల్), అనిరెడ్డి అఖిల(మేడ్చల్)

బైపీసీలో...: 11 మంది 436 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వివరాలు అతావుల్లా (నిజామాబాద్), వీరమల్ల చైతన్య(నల్లగొండ), గుండ్లకుంట వరూధిణి(మహబూబ్‌నగర్), చిలువేరు అనూష(రంగారెడ్డి), షేక్ ఇఫ్రా (రంగారెడ్డి), గవిరెడ్డి శ్రావణి(రంగారెడ్డి), మహ్మద్ దుర్దాణా పర్వీన్(రంగారెడ్డి), మల్లేపల్లి నవ్యశ్రీ (మేడ్చల్), ఠాకూర్ హారిక (హైదరాబాద్), ఆర్మాన్ సానియాఖాన్(హైదరాబాద్), చందుపట్ల ప్రత్యూషరెడ్డి(హైదరాబాద్).

ఎంఈసీలో...: ఆరుగురు 493 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వారి కంచుపతి యువ రజని(మేడ్చల్), భూపాల్‌రెడ్డి శివారెడ్డి(మేడ్చల్), గుడపాటి స్పందన (మేడ్చల్), దీపిక సాహూ (హైదరాబాద్), దొడ్డవారి ప్రణీత(హైదరాబాద్), వి.రిషిక (హైదరాబాద్).

సీఈసీలో..: బి.హర్ష (492) వరంగల్, దూరిశెట్టి వివేక్(488) కరీంనగర్, తస్లీం ఫాతిమా(488) రంగారెడ్డి, భవేష్ గోయల్(488)మేడ్చల్, పస్తం దేవిక(488) హైదరాబాద్ టాపర్లుగా నిలిచారు.

హెచ్‌ఈసీలో..: లిఖితారెడ్డి(470) హైదరాబాద్, సుంకరి శ్రీసాయితేజ (469)హైదరాబాద్, వెన్న మేఘన(469) హైదరాబాద్, పల్లె శ్రీను (464) మెదక్, జర్పుల నందిని(463) భద్రాద్రి కొత్తగూడెం టాపర్లుగా నిలిచారు.

గ్రూపుల వారీగా టాపర్ల వివరాలు..

సెకండియర్ ఎంపీసీలో...

పేరు

మార్కులు

జిల్లా

కొండా నిఖిత

993

ఖమ్మం

మహ్మద్ నోమన్ రజ్వి

993

నిజామాబాద్

వంగాల సాయిచరణ్

992

ఖమ్మం

కల్లూరి నితిన్ కుమార్

991

వరంగల్ అర్బన్

సీహెచ్ భానుప్రకాష్

991

భద్రాద్రి

చల్లా కావ్యశ్రీ

991

రంగారెడ్డి

అనుగు శివమూర్తి రెడ్డి

991

మేడ్చల్

ఎం.రాజవెంకట్ రెడ్డి

991

మేడ్చల్

సెకండియర్ బైపీసీ...

పిట్టల లక్ష్మి భవానీ

991

మంచిర్యాల

పోతరాజు దీపిక

991

రంగారెడ్డి

అమ్లినా ప్రియదర్శిని

991

హైదరాబాద్

బాల్నే అనుదీప్

990

రంగారెడ్డి

రుతుజ చల్లావర్

990

రంగారెడ్డి

దేవళ్ల మన్షి దినేష్

990

మేడ్చల్

సనా ఫాతిమా

990

హైదరాబాద్

మన్షా జరీన్

990

హైదరాబాద్

ఎంఈసీలో...

 

 

పోచంపల్లి దివ్య

986

మేడ్చల్

జంగా వంశీకృష్ణ

985

మేడ్చల్

ఆర్.అలేఖ్య

985

మేడ్చల్

బి.భార్గవ్

984

మేడ్చల్

తిరుమల రెడ్డి ప్రవళిక

983

హైదరాబాద్

సీఈసీలో...

 

 

జె.సాయిస్వరూప్ రెడ్డి

976

వనపర్తి

బండారి కీర్తి

974

వరంగల్ అర్బన్

శ్రీరామోజు వైష్ణవి

970

కరీంనగర్

బి. శిరీష

969

సంగారెడ్డి

ఎం.వి.నాగసాయి శ్రావ్య

969

హైదారబాద్

హెచ్‌ఈసీలో...

 

 

శివార్చక మానస

950

మహబూబ్‌నగర్

బోర సతీశ్

930

నల్లగొండ

కాట్ల మహేశ్

928

మంచిర్యాల

కేతావత్ పవన్ కల్యాణ్

928

వికారాబాద్

పోతుల కిరణ్‌బేడీ

927

పెద్దపల్లి


మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ....
పథమ, ద్వితీయ సంవత్స రం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూ ల్‌ను ఈనెల 16న ఇంటర్ బోర్డు విడుదల చేసిం ది. మే 15 నుంచి మే 23 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.

మూడ్రోజుల్లో మెమోలు
మూడ్రోజుల్లో మార్కుల జాబితాలు, మెమోలు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, నోడల్ అధికారులకు పంపిస్తామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. మార్కుల జాబితా, మెమోలను కాలేజీ ప్రిన్సిపాళ్లు ఈ నెల 19 నుంచి జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, నోడల్ అధికారుల నుంచి పొందాలని సూచించారు. మెమోల్లో తప్పిదాలుంటే మే 17లోగా ఇంటర్మీడియెట్ బోర్డుకు నివేదించాలన్నారు.

అపరాధ రుసుముతో ఫీజుకు నో ఛాన్స్...
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సం బంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు తమ ఫీజును ఈ నెల 22లోగా తప్పనిసరిగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో ఫీజులు తీసుకునే అవకాశం లేదన్నారు. సంబంధిత కాలేజీల్లోనే ఫీజు చెల్లించాలని, కోర్సు కేటగిరీల వారీగా ప్రత్యేకంగా ఫీజులు నిర్దేశించినట్లు వివరించారు. మార్చి పరీక్షల హాల్ టికెట్ నంబర్లే సప్లిమెంటరీ పరీక్షలకు వర్తిస్తాయన్నారు. ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్/ఫెయిల్ అయిన సబ్జెక్టు పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు జనరల్ ఫీజుతో పాటు అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ.120 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుం ది. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు సంబంధించి పాత/కొత్త మార్కుల్లో ఎక్కువ మార్కులు ఉన్న వాటినే కేటాయిస్తామని, అయితే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే బెస్ట్ స్కోర్ ఇస్తామని తెలిపారు. సెకండియర్ ఉత్తీర్ణులైన వారు రెండేళ్ల వరకు ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఉంది. ఈ అడ్వాన్‌‌సడ్ సప్లిమెం టరీ పరీక్షల్లో 2015 మార్చిలో ఉత్తీర్ణులైన వా రూ చివరిసారిగా ఇంప్రూవ్‌మెంట్ రాసే వీలుంది.

అడ్వాన్స్డ్ పరీక్షల టైం టేబుల్..

తేదీ

ఫస్టియర్

సెకండియర్

15-05-2017(సోమవారం)

సెకండ్ లాంగ్వేజీ-1

సెకండ్ లాంగ్వేజీ-2

16-05-2017(మంగళవారం)

ఇంగ్లిష్-1

ఇంగ్లిష్-2

17-05-2017(బుధవారం)

గణితం-1ఏ, బోటనీ-1
సివిక్స్-1, సైకాలజీ-1

గణితం-2ఏ, బోటనీ-2
సివిక్స్-2, సైకాలజీ-2

18-05-2017(గురువారం)

గణితం-1బి, జువాలజీ-1
హిస్టరీ-1

గణితం-2బి, జువాలజీ-2
హిస్టరీ-2

19-05-2017(శుక్రవారం)

ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1
క్లాసికల్ లాంగ్వేజీ-1

ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2
క్లాసికల్ లాంగ్వేజీ-2

20-05-2017(శనివారం)

కెమిస్ట్రీ-1, కామర్స్-1
సోషియాలజీ-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్

కెమిస్ట్రీ-2, కామర్స్-2,
సోషియాలజీ-2, ఫైన్‌ ఆర్ట్స్-2, మ్యూజిక్-2

22-05-2017(సోమవారం)

జియోలజీ-1, హోమ్‌సైన్‌‌స-1
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-1,
బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ)

జియోలజీ-2, హోమ్‌సైన్‌‌స-2
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2
బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-2(బైపీసీ)

 

23-05-2017(మంగళవారం)

మోడ్రన్ లాంగ్వేజీ-1, జియోగ్రఫీ-1

మోడ్రన్ లాంగ్వేజీ-2, జియోగ్రఫీ-2

ప్రయోగ పరీక్షలు మే 24 నుంచి మే 28 వరకు జరుగుతాయి
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మే 29 (సోమవారం), ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మే 30(మంగళవారం) నిర్వహిస్తారు
Published date : 17 Apr 2017 02:34PM

Photo Stories