Skip to main content

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు.
క్రమక్రమంగా ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని.. ప్రభుత్వ కాలేజీల్లో పెరుగుతోందని కడియం చెప్పారు. ప్రైవేటు కాలేజీలే బాగుంటాయన్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని తెలిపారు. మొత్తంగా ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికల ఉత్తీర్ణతాశాతం అధికంగా నమోదైనట్టు చెప్పారు.

ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల హవా కొనసాగింది. ప్రైవేటు కాలేజీలను మించి ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ప్రైవేటు కాలేజీల విద్యార్థులు 69 శాతం ఉత్తీర్ణత సాధించగా.. గురుకులాలు సహా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 71 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశారు.

ప్రథమ సంవత్సరంలో..
రాష్ట్రవ్యాప్తంగా 4,55,789 మంది ఫస్టియర్ పరీక్షలకు హాజరుకాగా.. 2,84,224 మంది (62.35 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,15,366 మంది పరీక్షలు రాయగా.. 2,60,558 మంది (62.73%) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 40,423 మంది పరీక్షలకు హాజరుకాగా.. 23,666 మంది (58.55%) ఉత్తీర్ణులయ్యారు.

ఫస్టియర్‌లో బాలబాలికల వారీగా ఉత్తీర్ణత

కేటగిరీ

హాజరు

ఉత్తీర్ణత

శాతం

బాలికలు

2,29,441

1,58,247

69

బాలురు

2,26,348

1,25,977

55.66


ద్వితీయ సంవత్సరంలో..
సెకండియర్ పరీక్షలకు 4,29,378 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,88,772 మంది (67.25%) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3,95,721 మంది పరీక్షలు రాయగా.. 2,65,360 మంది (67.06%) ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ విద్యార్థులు 33,657 మంది హాజరుకాగా.. 23,412 మంది (69.56%) పాసయ్యారు. ఇక మరో 74,613 మంది ప్రైవేటుగా పరీక్షలురాయగా.. 19,089 మంది (26%) ఉత్తీర్ణులయ్యారు.

సెకండియర్‌లో బాల బాలికల వారీగా ఉత్తీర్ణత..

కేటగిరీ

హాజరు

ఉత్తీర్ణత

శాతం

బాలికలు

2,20,95

1,61,221

73.25

బాలురు

2,09,283

1,27,551

61


రెండింటా మేడ్చల్ టాప్
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండింటిలోనూ మేడ్చల్ జిల్లా టాప్‌గా నిలిచింది. ఫస్టియర్‌లో 79 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ టాప్‌లో, 74 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచాయి. 42 శాతం ఉత్తీర్ణతతో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. వొకేషనల్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో కొమురంభీం జిల్లా టాప్‌లో, 71 శాతంతో వనపర్తి రెండో స్థానంలో నిలవగా.. 46 శాతం ఉత్తీర్ణతతో నాగర్‌కర్నూల్, జగిత్యాల చివరి స్థానంలో నిలిచాయి.

సెకండియర్ జనరల్ ఇంటర్‌లో 80 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్, కొమురంభీం జిల్లాలు టాప్‌లో నిలవగా.. 77 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. వొకేషనల్‌లో 86 శాతం ఉత్తీర్ణతతో వనపర్తి ప్రథమ స్థానంలో, 84 శాతంతో కొమురంభీం రెండో స్థానంలో నిలవగా.. 55 శాతంతో సిద్దిపేట చివరి స్థానంలో నిలిచింది.

ఫస్టియర్‌లో గ్రేడ్‌ల వారీగా ఉత్తీర్ణత వివరాలు
‘ఎ’గ్రేడ్‌లో:
1,56,615 (55.1%)
‘బి’గ్రేడ్‌లో: 77,969 (27.43%)
‘సి’గ్రేడ్‌లో: 34,368 (12.09%)
‘డి’గ్రేడ్‌లో: 15,272 (5.37%)

సెకండియర్‌లో గ్రేడ్‌ల వారీగా ఉత్తీర్ణత వివరాలు
‘ఎ’గ్రేడ్‌లో:
1,65,006 (57.14%)
‘బి’గ్రేడ్‌లో: 82,603 (28.6%)
‘సి’గ్రేడ్‌లో: 31,122 (10.77%)
‘డి’గ్రేడ్‌లో: 10,041 (3.48%)

సత్తా చాటిన గురుకులాలు
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలో గురుకులాలు సత్తా చాటాయి. 97.7 శాతం ఉత్తీర్ణతతో విద్యాశాఖ గురుకులాలు (టీఎస్‌ఆర్‌జేసీ) అత్యధిక ఉత్తీర్ణతను సాధించగా.. తరువాత స్థానంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలు నిలిచాయి. మొత్తంగా గురుకులాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు కలిపి 71.42 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రైవేటు కాలేజీలు 69 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.

యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణ్ణత వివరాలు

కేటగిరీ

ప్రథమ సంవత్సరం

ద్వితీయ సంవత్సరం

నేజ్‌మెంట్

హాజరు

ఉత్తీర్ణత

శాతం

హాజరు

ఉత్తీర్ణత

శాతం

ప్రభుత్వ

73,553

41,143

55.9

61,139

43,051

70

ఎయిడెడ్

9,069

5,487

60.5

5,085

2,786

55

మోడల్ స్కూల్స్

15,361

9,099

59.2

13,010

8,900

68

ఎస్‌ఆర్‌జేసీ

779

625

80.2

763

620

81

షల్‌వెల్ఫేర్

9,219

7,698

83.5

8,809

7,617

86

ట్రైబల్ వెల్ఫేర్

2,869

2,322

80.9

3,005

2,601

87

ప్రైవేటు

3,01,009

1,97,604

65.6

2,92,627

2,02,617

69


18 నుంచి మార్కుల మెమోలు
ఇంటర్ ఫలితాలకు సంబంధించి మార్కుల మెమోలను ఈనెల 18 నుంచి విద్యార్థులకు అందజేయనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మెమోల్లో ఏవైనా తప్పిదాలు ఉన్నట్టయితే.. మే 14వ తేదీలోపు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ల ద్వారా బోర్డుకు దరఖాస్తు చేయాలని పేర్కొంది. నిర్దేశిత తేదీ తర్వాత వచ్చే వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

రీవెరిఫికేషన్, జవాబు పత్రాల ప్రతుల కోసం..
విద్యార్థులు తమ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, జిరాక్స్ ప్రతులు పొందేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ఇందుకోసం విద్యార్థులు ్టటఛజ్ఛీ. ఛిజజ. జౌఠి. జీ వెబ్‌సైట్ నుంచి రీవెరిఫికేషన్/ రీకౌంటింగ్/ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్‌లో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని.. దరఖాస్తును పూరించాలని బోర్డు సూచించింది. ఈనెల 16 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలి. జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలి. నిర్ణీత తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించరు.
Published date : 14 Apr 2018 11:59AM

Photo Stories