స్టడీ మెటీరియల్ ఒత్తిడి ఉండకూడదు: ఇంటర్‌బోర్డు హెచ్చరిక
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు తమ సొంత సిలబస్‌ను అమలు చేసేలా స్టడీ మెటీరియల్‌ను రూపొందించి.. వాటినే కొనుగోలు చేయాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి.
ఇందుకు ఆయా కాలేజీలు రూ. 10,000 - 20,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఒకపక్క ప్రభుత్వం కాలేజీల్లో అడ్మిషన్లను నియంత్రించేలా కొన్ని నిబంధనలు విధించినా, వాటిని పట్టించుకోకుండా కొన్ని ప్రైవేటు కాలేజీలు ఇప్పటికే ఇష్టానుసారం చేరికలు నిర్వహించాయి. కోవిడ్ నేపథ్యంలో సిలబస్‌ను 30 శాతం కుదిస్తూ ఇటీవలే ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది. బోర్డ్ ఆదేశాలను పట్టించుకోకుండా, కాలేజీలు తమ వద్ద ఉన్న పాత మెటీరియల్‌ను తీసుకోవాల్సిందేనని విద్యార్థులకు బలవంతం చేస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు వస్తుండడంతో ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు హెచ్చరికలు జారీచేసింది.ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. 9391282578 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Published date : 21 Aug 2020 01:50PM