సందేహాలుంటే డీఐఈవోలను సంప్రదించండి: ఇంటర్ బోర్డు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్(ఆర్వీ), రీకౌంటింగ్(ఆర్సీ) కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు bie.telangana.gov.inవెబ్‌సైట్ లేదా టీఎస్‌ఆన్‌లైన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఏప్రిల్ 24న ఓ ప్రకటనలో తెలిపింది.
రీవాల్యుయేషన్‌కు రూ.600, రీకౌంటింగ్‌కు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపింది. మరింత సమాచారం కోసం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. డీఐఈవో హైదరాబాద్-9848781805, డీఐఈవో రంగారెడ్డి- 9848018284, డీఐఈవో మేడ్చల్- 9133338584 లోనూ సంప్రదించవచ్చంది.
Published date : 25 Apr 2019 04:35PM