రీ-వ్యాల్యు యేషన్ కు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు జవాబు పత్రం రీ-వ్యాల్యుయేషన్ (ఆర్వీ)కు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్న ఇదే.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాల నేపథ్యంలో నెలకొన్న వివాదంపై స్పందించిన సీఎం.. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో.. ఉచితంగా రీ-వ్యాల్యుయేషన్ చేపట్టాలని ఆదేశించారు. అయితే సీఎం ఆదే శించినప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు మాత్రం ఉచిత రీ-వ్యాల్యు యేషన్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలనే రీ-వ్యాల్యు యేషన్ చేస్తారా? లేక పరీక్షలో తప్పిన విద్యార్థులందరి జవాబు పత్రాలను దరఖాస్తుతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో పునఃమూల్యాంకనం చేస్తారా? అనేదానిపై అయోమయం నెలకొంది.
దరఖాస్తుకు డబ్బులు తప్పనిసరి :
రీ-వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో తప్పకుండా ఫీజు చెల్లించాల్సిందే. ఇందు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600, రీకౌంటింగ్ (ఆర్సీ)కు రూ.100 చొప్పున ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో లేదా టీఎస్-ఆన్‌లైన్ కేంద్రాల్లో ఫీజును చెల్లించాలి. ఏప్రిల్ 24 (బుధవారం) వరకు దాదాపు 55వేల మంది రీ-వ్యాల్యుయేషన్, రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 27తో ఈ రెండింటి దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రకటనలో స్పష్టత కరువు :
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఆర్వీ, ఆర్సీ, ఇంప్రూవ్‌మెంట్‌పై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటన విడుదల చేశారు. ‘ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను ఉచితంగా రీ-వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాస్ అయిన వారు మాత్రం రీ-వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లించాలి. ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్ష రాయాలనుకుంటే సప్లిమెంటరీ ఫీజును ఏప్రిల్ 27లోగా తమ తమ కాలేజీలో చెల్లించాలి’అని ప్రకటనలో ఉంది. ఇందులో ఫెయిలైన విద్యార్థులు రీ-వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

Published date : 26 Apr 2019 06:26PM