రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై హైకోర్టుకు ఇంటర్ బోర్డ్ వివరణ
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు విచారణ జరిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఫెయిలైన 3 లక్షల 20వేల మంది విద్యార్థుల సమాధాన పత్రాలను రీవెరిఫికేషన్ చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఎప్పటిలోగా ప్రక్రియను పూర్తి చేస్తారంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ... మే 8వ తేదీలోగా రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు.
మే 8న తదుపరి విచారణ...
మే 8లోగా రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసి, వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. బోర్డు ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత 8వ తేదీ మధ్యాహ్నం ఫిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది.

Published date : 30 Apr 2019 03:05PM