Skip to main content

ఫిబ్రవరి 1న జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ బంద్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొన్నారు. కాగా ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 20 వరకు ఆదివారాలతో సహ ప్రతి రోజూ రెండు విడతలుగా జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 931 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఉదయలక్ష్మి తెలిపారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఆమె జనవరి 31న క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు జనరల్ కోర్సుకు సంబంధించి 3,33,817 మంది, వొకేషనల్ కోర్సుకు సంబంధించి 60,486 మంది హాజరుకానున్నారు.
Published date : 01 Feb 2019 02:51PM

Photo Stories