ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ఉచిత కోచింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 2న హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇంటర్ బోర్డును దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యాపారాన్ని తగ్గించి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. కార్పొరేట్ ర్యాంకుల కు పోటీగా ప్రభుత్వ కాలేజీలకు ర్యాంకులు రావాలని, ఆ దిశగా అధ్యాపకులు పనిచేయాలని సూచించారు.
Published date : 03 Jan 2018 01:53PM