పేద ఆర్యవైశ్య బాలికలకు ఉచిత విద్య
Sakshi Education
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న అత్యంత నిరుపేద బాలికలకు ఉచిత విద్యను అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం మే 9న ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్‌లో 80 శాతం మార్కులు సాధించి, ఇతర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన చదువుకునే స్థోమత లేని నిరుపేద బాలికలను దత్తత తీసుకొని ఉన్నత విద్యను పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జువ్వాది శ్రీనివాస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనాధ, కేవలం తల్లిమీద ఆధారపడి జీవించే బాలికలకు తొమ్మిదో తరగతి పైనుంచి చదివించనున్నట్లు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ మధ్య, తెలంగాణలో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఉన్న కాలేజిల్లో మాత్రమే చదివించనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు 9399926127, 9491294513 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Published date : 10 May 2018 02:37PM