పది రోజుల్లో ఇంటర్ లాంగ్ మెమోలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫలితాల్లో గందరగోళం కారణంగా పాసైన విద్యార్థులకు ఇవ్వాల్సిన లాంగ్ మెమోల జారీలో ఆలస్యం అవుతోంది.
మొత్తానికి విద్యార్థుల డేటాను క్రోడీకరించిన ఇంటర్ బోర్డు 10 రోజుల్లో లాంగ్ మెమోలను జారీ చేస్తామని వెల్లడించింది. ఎవరికై నా మెమోలు అత్యవసరం ఉంటే వారు ceotsbie16 @gmail.com కు మెయిల్ చేయాలని తెలిపింది. అలాంటి వారికి మాన్యువల్‌గా లాంగ్ మెమోలను/పాస్ సర్టిఫికెట్‌ను పంపిస్తామని పేర్కొంది. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
Published date : 08 Nov 2019 03:34PM