నవంబర్ 6న ఏపీ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ నవంబర్ 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి ఎమ్.సుధీర్‌రెడ్డి నవంబర్ 2న ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు నాగార్జున యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో జరిగే ఈ కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవచ్చన్నారు. గతంలో ఆప్షన్లు ఇవ్వని వాళ్లు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాలేజీ, కోర్సు మార్పు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కూడా ఈసారి ఆప్షన్లు ఇవ్వవచ్చని సుధీర్‌రెడ్డి తెలిపారు.
Published date : 04 Nov 2019 04:18PM