నవంబర్ 1 వరకు ఇంటర్ ఫీజు గడువు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ సెకండియర్ పరీక్ష ఫీజును నవంబర్ 1 తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండానే చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్టు ఇన్‌చార్జి కార్యదర్శి సంధ్యారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా నవంబర్ 10 లోగా అయితే రూ.120, 17వ తేదీలోగా రూ.500, 28వ తేదీలోగా రూ.1000, డిసెంబర్ 21లోగా రూ.2000, 31వ లోగా రూ.3,000, జనవరి 18 లోగా అయితే రూ.5,000 అలస్యరుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
Published date : 26 Oct 2016 03:31PM