మనసంతా.. మార్కులపైనే !
Sakshi Education
ఇంటర్ ఎంపీసీ అనగానే... భవిష్యత్ గురించి బోలెడు ఆశలు... ఎన్నో అంచనాలు... మరోవైపు తీవ్రమైన పోటీ.. అందుకే ప్రతి మార్కు ఎంతో కీలకం! ఫిబ్రవరి నెల చివరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపీఈ) జరగనున్నాయి. దీంతో విద్యార్థులంతా తుదిదశ ప్రిపరేషన్‌లో మునిగిపోయారు.
ఫోకస్ అంతా ఇంటర్‌పైనే..
ఎంపీసీ విద్యార్థుల్లో అత్యధికులు లక్ష్యంగా చేసుకునే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంది. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వంద శాతం మార్కులు సాధించేందుకు కృషిచేయాలి. ఇప్పటివరకు జేఈఈ, ఎంసెట్ కోణాల్లో ప్రిపేరైన విద్యార్థులు.. ప్రస్తుతం వాటి ప్రిపరేషన్‌ను పక్కనపెట్టి ఇంటర్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలి. విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతో, ప్రణాళిక లోపంతో కొన్ని చాప్టర్లను వదిలేస్తుంటారు. కానీ, ఇది సరికాదు. కచ్చితత్వం, సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చి గత ప్రశ్నపత్రాలను సాధించడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. ప్రతి చాప్టర్ అధ్యయనంతోపాటు వాటిలో ఉండే ప్రాబ్లమ్స్‌ను సాధించాలి. ఈ సమయంలో కాలేజీ మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాల్లోని కాన్సెప్టులను చదవడం లాభిస్తుంది. రివిజన్‌లో వ్యాసరూప ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తొలుత తేలికపాటి చాప్టర్లను పూర్తిచేసి..అనంతరం క్లిష్టమైన చాప్టర్లకు అధిక సమయం వెచ్చించాలి. ఇలా చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జేఈఈలో టాప్ ర్యాంక్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు పాఠ్యాంశాల్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను పక్కన పెట్టి.. కేవలం ఇంటర్ పరీక్షల కోణంలోనే అధ్యయనం చేస్తే సరిపోతుంది.
- ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
ఇంటర్‌లో ఎన్ని గ్రూపులు ఉన్నా.. అందరి దృష్టి ఎంపీసీపైనే! ఈ నేపథ్యంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కుల సాధనకు ఏంచేయాలి? ఏయే పాఠ్యాంశాలపై ఫోకస్ పెట్టాలి? ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటి? తదితరాలతోపాటు తుది దశ ప్రిపరేషన్‌పై నిపుణుల గెడైన్స్...
మ్యాథమెటిక్స్ :
మ్యాథ్స్ II-Aలో ముఖ్యమైన చాప్టర్లు:
మ్యాథమెటిక్స్ :
మ్యాథ్స్ II-Aలో ముఖ్యమైన చాప్టర్లు:
- ద్విపద సిద్ధాంతం
- సంకీర్ణ సంఖ్యలు, డిమోవిర్ సిద్ధాంతం
- సాంఖ్యకశాస్త్రం
- సంభావ్యత. ద్విపద సిద్ధాంతంలో.. అనంత శ్రేఢి, ద్విపద సిద్ధాంత నిరూపణ, గుణకాలు అంకశ్రేఢిలో ఉంటే వాటి మధ్య సంబంధాల నుంచి 7 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మధ్యపదం, పదాల సంఖ్య, స్థిర పదం, గుణకం కనక్కోవటం, వ్యాప్తిల నుంచి లఘు సమాధాన ప్రశ్నలు అడుగుతారు. ద్విపద సిద్ధాంతం పాఠ్యాంశం పూర్తిగా అభ్యసన ఆధారితంగా ఉంటుంది. ఇందులో కొన్ని ప్రశ్నలు విద్యార్థులకు కఠినంగా అనిపిస్తాయి. అయితే వెయిటేజీ పరంగా ఈ చాప్టర్ అత్యంత కీలకం. కాబట్టి అభ్యర్థులు ఈ పాఠ్యాంశాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
- సంభావ్యతలో రెండు చాప్టర్లు ఉన్నాయి. విద్యార్థులు వీటిపై సిద్ధాంతపరంగానే కాకుండా.. మార్కుల కోణంలోనూ దృష్టిపెట్టాలి. సంభావ్యత సంకలన సిద్ధాంతం, గుణకార సిద్ధాంతం, ఇచ్చిన పట్టిక నుంచి ‘కె’విలువ కనుగొనటం, మధ్యమం, విస్తృతిలను కనుగొనటం తదితరాలు ముఖ్యమైనవే కాకుండా సులభంగానూ ఉంటాయి.
- ‘ప్రస్తారాలు, సంయోగాలు’ను క్లిష్టమైన చాప్టర్‌గా చెప్చొచ్చు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల కోణంలో కొన్ని కీలక ప్రశ్నలకు జవాబులు నేర్చుకుంటే సరిపోతుంది. ఈ చాప్టర్ నుంచి 4 మార్కులు, 2 మార్కులు ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. ఇచ్చిన పదానికి కోటి(ర్యాంక్) కనుగొనటం, సంఖ్యల మొత్తం తదితరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- థియరీ ఆఫ్ ఈక్వేషన్, వర్గసమీకరణాలు, పాక్షిక భిన్నాలు, సాంఖ్యక శాస్త్రం చాప్టర్లు మిగిలిన వాటితో పోల్చితే సులభంగా ఉంటాయి. ఈ చాప్టర్‌లో.. మధ్యమ విచలనం, విస్తృతి, క్రమ విచలనం ముఖ్యమైనవి.
- మ్యాథ్స్ II-Bను విద్యార్థులు క్లిష్టమైందిగా భావిస్తుంటారు. కానీ, గత మూడేళ్ల ఇంటర్ ప్రశ్నపత్రాలను పరిశీలించి.. ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకుంటే ఈ పేపర్‌లోనూ ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఇందులో వృత్తాలు (22 మార్కులు), నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు(33 మార్కులు), అవకలన సమీకరణాలు (13 మార్కులు) కీలక చాప్టర్లుగా ఉంటాయి.
- నిరూపక రేఖా జ్యామితిలో వృత్తాలు, శాంఖవాలు సిద్ధాంతపరమైనవిగా ఉంటాయి. వృత్తాలను పూర్తిగా అధ్యయనం చేస్తే శాంఖవాలు గురించి 50 శాతం అవగాహన లభిస్తుంది. వృత్తంలో వచ్చే భావనలు, విశ్లేషణలు, సంకేతాలు, సూత్రాలు.. దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
- నిశ్చిత సమాకలనం, అవకలన సమీకరణాల్లో సూత్రాల వాడకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. దీన్నుంచి రిడక్షన్ ఫార్ములా, త్రికోణమితి సమాకలనాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
- మ్యాథ్స్ II-B లో అడిగే ప్రశ్నలు దాదాపు నేరుగా, ఎలాంటి తికమక లేకుండా ఉంటాయి. విద్యార్థులు సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. తద్వారా సమస్యలు సాధించేటప్పుడు ఎలాంటి సందిగ్ధత తలెత్తదు. కొన్ని సూత్రాలు, ప్రక్రియలు ఒకేలా అనిపించినప్పుడు ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలి. సరైన సూత్రాన్ని సరైన సమయంలో, సరైన సమస్యలో వినియోగించడమనేది స్వీయ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. కఠినమైన, అధిక ప్రాధాన్యత ఉన్న సమస్యలను నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఫిజిక్స్‌లో వెయిటేజీ పరంగా.. వేవ్స్-6 మార్కులు; ఆప్టిక్స్ 12 మార్కులు, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ 10 మార్కులు, కరెంట్ ఎలక్ట్రిసిటీ 10 మార్కులు, మూవింగ్ ఛార్జెస్ ఇన్ మాగ్నెటిజం 6 మార్కులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 4, డ్యూయల్ నేచర్ ఆఫ్ మేటర్ 8 మార్కులు, సెమీ కండక్టర్ డివెజైస్‌కు 6 మార్కులు లభించే అవకాశముంది.
- సెమీకండక్టర్ డివెజైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్ తదితరాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఫిజిక్స్‌కు సంబంధించి విద్యార్థులు ఎలక్ట్రోస్టాటిక్ వేవ్ మోషన్, ఆప్టిక్స్‌ను కఠినంగా భావిస్తారు. అయితే డాప్లర్ ప్రభావం, ఫ్లెమింగ్ ఎడమ, కుడి నియమాలు, అర్ధవాహక పరికరాలు, వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణల గురించి క్షుణ్నంగా చదవడం తప్పనిసరి.
- డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్
- రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్
- వర్కింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్
- వర్కింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్
- వర్కింగ్ ఆఫ్ కిర్కాఫ్స్ లా, హీట్‌స్టోన్ బ్రిడ్జ్
- ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్
- మూవింగ్ కాయిల్ గాల్వనామీటర్
- లా ఆఫ్ రేడియేషన్ తదితర..
- కెమిస్ట్రీలో ఎక్కువ కాన్సెప్టులు ఉండటంతో.. విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో పోల్చితే దీన్ని కఠినమైన సబ్జెక్టుగా భావిస్తుంటారు. సిలబస్ పరంగానూ కెమిస్ట్రీ మిగతా రెండు సబ్జెక్టులతో పోల్చితే పెద్దగా ఉంటుంది. కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ క్లిష్టమైన చాప్టర్లుగా ఉంటాయి. వీటిలో నుంచి ఎక్కువగా రీజనింగ్ ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
- విద్యార్థులు తెలుగు అకాడమీ పుస్తకాలను చదువుతూ... ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని నోట్స్‌లో రాసుకొని సాధ్యమైనన్నిసార్లు పునశ్చరణ చేయాలి.
- పి-బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం, కెమికల్ కై నటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఓజోన్ ప్రిపరేషన్, లక్షణాలు.
- క్లోరిన్, నోబెల్ గ్యాస్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్, స్ట్రక్చర్ ఆఫ్ XeF4, XeF2.
- ఫీనాల్, ఈథర్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్.
- నేమ్డ్ రియాక్షన్స్. ఉదా: ఆల్డాల్ కండెన్సేషన్, విలియమ్‌సన్ సింథసిస్..
- ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీల్లో ప్రతిదాన్నుంచి ఒక దీర్ఘ సమాధాన ప్రశ్న చొప్పున అడుగుతారు.
ఫోకస్ అంతా ఇంటర్‌పైనే..
ఎంపీసీ విద్యార్థుల్లో అత్యధికులు లక్ష్యంగా చేసుకునే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంది. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వంద శాతం మార్కులు సాధించేందుకు కృషిచేయాలి. ఇప్పటివరకు జేఈఈ, ఎంసెట్ కోణాల్లో ప్రిపేరైన విద్యార్థులు.. ప్రస్తుతం వాటి ప్రిపరేషన్‌ను పక్కనపెట్టి ఇంటర్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలి. విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతో, ప్రణాళిక లోపంతో కొన్ని చాప్టర్లను వదిలేస్తుంటారు. కానీ, ఇది సరికాదు. కచ్చితత్వం, సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చి గత ప్రశ్నపత్రాలను సాధించడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. ప్రతి చాప్టర్ అధ్యయనంతోపాటు వాటిలో ఉండే ప్రాబ్లమ్స్‌ను సాధించాలి. ఈ సమయంలో కాలేజీ మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాల్లోని కాన్సెప్టులను చదవడం లాభిస్తుంది. రివిజన్‌లో వ్యాసరూప ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తొలుత తేలికపాటి చాప్టర్లను పూర్తిచేసి..అనంతరం క్లిష్టమైన చాప్టర్లకు అధిక సమయం వెచ్చించాలి. ఇలా చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జేఈఈలో టాప్ ర్యాంక్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు పాఠ్యాంశాల్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను పక్కన పెట్టి.. కేవలం ఇంటర్ పరీక్షల కోణంలోనే అధ్యయనం చేస్తే సరిపోతుంది.
- ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
Published date : 13 Feb 2019 02:19PM