Skip to main content

మే 21న ఇంటర్ పవేశాల నోటిఫికేషన్ : అశోక్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ కాలేజీలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
మే 21న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీలు తమ అఫిలియేషన్ సర్టిఫికెట్‌ను కాలేజీ ప్రాంగణంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తం గా 1,684 కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 786 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చామన్నారు. మరో 559 కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని, వీటిలో ఎక్కువగా మౌలిక వసతుల లోపాలున్నాయన్నారు. ఏప్రిల్ 30 తర్వాత అఫిలియేషన్ కాలేజీల జాబితాను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అఫిలియేషన్ ఉన్న కాలేజీల వివరాలను తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్లు పొందాలని సూచించారు. కాలేజీ హాస్టళ్లను కూడా బోర్డు పరిధిలోకి తెచ్చామని, హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి ఏప్రిల్ 20 వరకు వచ్చిన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల సంఖ్య అతి తక్కువగా ఉందని, యాజమాన్యాలు దరఖాస్తులపై శ్రద్ధ చూపలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హాస్టల్ దరఖాస్తు గడువు పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Published date : 30 Apr 2018 02:57PM

Photo Stories