Skip to main content

మే 17న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష

సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఐఐటీ ఢిల్లీ విడుదల చేసింది.
20 20 మే 17న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను జూన్ 8న ప్రకటిస్తామని వెల్ల డించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మరోవైపు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ మొదటి విడత ఆన్‌లైన్ పరీక్షలను 2020 జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.ఫలితాలను జనవరి 31 న విడుదల చేయనుంది.

జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టుల కొరకు క్లిక్ చేయండి.


ఇక రెండో విడత ఆన్‌లైన్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ మధ్య నిర్వహించనుంది. ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయ నుందని జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్‌సైట్‌లో ఐఐటీ ఢిల్లీ స్పష్టం చేసింది. దీంతో అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వచ్చే ఏడాది మే 17న నిర్వహిస్తామని, ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. వాటి ఫలితాలను జూన్ 8న విడుదల చేస్తామని తెలిపింది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును అదే నెల 12న నిర్వహించి వాటి ఫలితాలను అదే నెల 16న విడుదల చేయనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) 2020 జూన్ 17 నుంచి ప్రారంభిస్తుందని ఐఐటీ ఢిల్లీ స్పష్టం చేసింది.
Published date : 06 Nov 2019 05:11PM

Photo Stories