మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పరీక్ష ఫీజును 20లోగా చెల్లించాలి
సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 20లోగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉండదన్నారు. ఫస్టి యర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవ చ్చని, సాధారణ పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని చెప్పా రు. ప్రైవేటు విద్యార్థులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని, వారు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్‌కే ఫీజు చెల్లించాలని వివరించారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
తేదీ | ఫస్టియర్ | సెకండియర్ |
14-05-2018 | సెకండ్ లాంగ్వేజీ-1 | సెకండ్ లాంగ్వేజీ-1 |
15-05-2018 | ఇంగ్లిష్-1 | ఇంగ్లిష్-2 |
16-05-2018 | గణితం-1ఏ, బోటనీ-1, సివిక్స్-1, సైకాలజీ-1 | గణితం-2ఏ, బోటనీ-2, సివిక్స్-2, సైకాలజీ-2 |
17-05-2018 | గణితం-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 | గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2 |
18-05-2018 | ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి-1 | ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజీ-2 |
19-05-2018 | కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1, ఫైన్ ఆర్ట్స్1, మ్యూజిక్-1 | కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్‌ఆర్ట్స్-2, మ్యూజిక్-2 |
21-05-2018 | జియోలజీ-1, హోమ్‌సై న్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-1, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ) | జియోలజీ-2, హోమ్‌సై న్స్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-2(బైపీసీ) |
22-05-2018 | మాడ్రన్ లాంగ్వేజీ-1, జియోగ్రఫీ-1 | మాడ్రన్ లాంగ్వేజీ-2, జియోగ్రఫీ-2 |