మే 10 నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశ ప్రక్రియ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ కోర్సు ప్రవేశాల ప్రక్రియ మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నీ మే 8 నుంచి 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు మే 30వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. ప్రవేశాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఆయా వర్గాలకు సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని స్పష్టం చేశారు.
మే 14 నుంచి 22 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ :
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 14 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయని ఉదయలక్ష్మి ఒక ప్రటకనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Published date : 08 May 2018 03:25PM